India: పాత రికార్డులు బద్దలు కొట్టండి: నరేంద్ర మోదీ పిలుపు

  • నేడు 9 రాష్ట్రాల్లో 71 నియోజకవర్గాలకు ఎన్నికలు
  • మూడు దశల పోలింగ్ శాతం రికార్డులు బద్దలు కొట్టండి
  • ట్విట్టర్ లో ప్రధాని మోదీ
భారత సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో దశ పోలింగ్ లో భాగంగా నేడు 71 లోక్ సభ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్న వేళ నరేంద్ర మోదీ తన ట్విట్టర్ ఖాతాలో స్పందించారు. ఇప్పటివరకూ మూడు దశల పోలింగ్ పూర్తయిందని గుర్తు చేస్తూ,  పోలింగ్ శాతం పరంగా ఆ రికార్డులను బద్దలు కొట్టాలని పిలుపునిచ్చారు.

 "సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మరో దశ పోలింగ్‌ ప్రారంభమైంది. ఓటర్లు భారీ సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు వచ్చి గత మూడు దశల రికార్డులను బద్దలు కొట్టాలి. యువ ఓటర్లు అధిక సంఖ్యలో పాల్గొనాలని నా విజ్ఞప్తి" అని నరేంద్ర మోదీ కోరారు. నేటి పోలింగ్ లో 9 రాష్ట్రాల్లోని 963 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఆపై మే 19 లోపు జరిగే మరో మూడు దశలతో ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుంది. ఆపై 23న ఫలితాల వెల్లడి ఉంటుందన్న సంగతి తెలిసిందే.



India
Narendra Modi
Elections
Twitter

More Telugu News