Chandrababu: చంద్రబాబు నిజంగా లోకేశ్ పప్పు ఫాదరే: రామ్ గోపాల్ వర్మ ఎద్దేవా

  • 40 ఏళ్ల రాజకీయ చరిత్ర ఇంతేనా
  • మూడు సార్లు సీఎంగా పనిచేసి భయమా
  • నిజాన్ని ఎన్నటికీ దాచలేరన్న చంద్రబాబు
నాలుగు దశాబ్దాల రాజకీయ చరిత్ర, మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన నారా చంద్రబాబునాయుడు, కేవలం 'లక్ష్మీస్ ఎన్టీఆర్' అన్న సినిమా పేరును చూసి భయపడుతున్నారని వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యానించారు. ఒకవేళ ఈ సినిమాను చూసి మీరు నిజంగా భయపడుతున్నట్లయితే, మీరు నిజంగా లోకేశ్ పప్పు ఫాదరేనని రుజువయినట్లేనని తన ట్విట్టర్ ఖాతాలో వ్యాఖ్యానించారు. అంతకుముందు, తనకు మద్దతుగా నిలిచిన వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు. నిజాన్ని ఎన్నటికీ దాచలేరన్న సంగతిని ఇంత వయసు వచ్చిన తరువాత కూడా చంద్రబాబుకు అర్థం కావడం లేదని, ఇది తనకు ఆశ్చర్యం కలిగిస్తోందని అన్నారు.





Chandrababu
Ramgopla Varma
Nara Lokesh
Twitter

More Telugu News