Jagan: రామ్ గోపాల్ వర్మకు అండగా నిలిచిన వైఎస్ జగన్!

  • వర్మ చేసిన తప్పేంటి
  • ప్రెస్ మీట్ పెట్టలేని స్థితిలో ప్రజాస్వామ్యం
  • ట్విట్టర్ లో వైఎస్ జగన్
"ఇంతకీ రామ్ గోపాల్ వర్మ చేసిన తప్పేంటి?" అని ప్రశ్నిస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్. నిన్న విజయవాడలో జరిగిన పరిణామాలను దృష్టిలో ఉంచుకుని, తన ట్విట్టర్ ఖాతాలో స్పందించిన జగన్, "విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టలేని పరిస్థితుల్లో మన ప్రజాస్వామ్యం ఉంది.  పోలీసుల్ని బంట్రోతులు కన్నా హీనంగా వాడుకునే పరిస్థితుల్లో మన ప్రజాస్వామ్యం ఉంది. ఇదా ప్రజాస్వామ్యం..? చంద్రబాబు గారూ..! ఇంతకీ రామ్ గోపాల్ వర్మ చేసిన తప్పేంటి..?" అని జగన్ మండిపడ్డారు. కాగా, నిన్న విజయవాడలో మీడియా సమావేశం నిర్వహించేందుకు వర్మ రాగా, పోలీసులు అడ్డుకుని వెనక్కు పంపిన సంగతి తెలిసిందే.



Jagan
Varma
andh
Lakshmi's NTR

More Telugu News