శ్రీలంక బాంబు పేలుళ్ల నిందితుల్లో ప్రిన్సిపాల్, తమిళ మీడియం టీచర్
- పోలీసుల అదుపులో 106 మంది అనుమానితులు
- ఉపాధ్యాయుడి నుంచి 50 సిమ్‌కార్డులు స్వాధీనం
- శుక్రవారం నాటి ఎన్‌కౌంటర్‌లోనూ వీరి పాత్ర
శుక్రవారం కల్మునై నగరంలోని సైంథముర్తు ప్రాంతంలో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు జరిగిన ఎదురు కాల్పుల ఘటనలోనూ వీరి ప్రమేయం ఉన్నట్టు పోలీసులు నిర్ధారించారు. ఇక్కడ ఓ ఇంట్లో నక్కిన ఉగ్రవాదులను భద్రతా దళాలు చుట్టుముట్టడంతో వారు ఎదురుకాల్పులకు దిగారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య రాత్రంతా భీకర ఎన్‌కౌంటర్ జరిగింది. తప్పించుకునే మార్గం లేక ముగ్గురు ఉగ్రవాదులు తమను తాము పేల్చేసుకున్నారు.