RGV: నా 16 ప్రశ్నలకు సమాధానం చెప్పకపోతే కోర్టుకు వెళతా: వర్మ హెచ్చరిక

  • చంద్రబాబుకు, విజయవాడ పోలీసులకు ప్రశ్నాస్త్రాలు
  • 16 గంటల్లోగా సమాధానం ఇవ్వాలంటూ ట్వీట్
  • ఫేస్ బుక్ లో ప్రశ్నల పోస్టు పెట్టి ట్విట్టర్ లో లింకు
తనను విజయవాడ నుంచి బలవంతంగా పంపించేయడంపై రామ్ గోపాల్ వర్మ మండిపడుతున్నారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంపై ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి వస్తే ఏ కారణాలతో తనను హైదరాబాద్ తిప్పి పంపారో చెప్పాలని నిలదీస్తున్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. చంద్రబాబునాయుడు, విజయవాడ పోలీసులకు తాను 16 ప్రశ్నలు సంధిస్తున్నానని, వాటికి 16 గంటల్లోగా జవాబు చెప్పకపోతే కోర్టుకెళ్లి తన హక్కులు సాధించుకుంటానని హెచ్చరించారు.

ఈమేరకు తన 16 ప్రశ్నలను ఫేస్ బుక్ అకౌంట్ లో పోస్టు చేసిన వర్మ దాని లింకును ట్విట్టర్ లో పెట్టారు. నా కారు ఆపాల్సిన అవసరం ఏంటి? తమకు ఆదేశాలున్నాయని పోలీసులు అంటున్నారు, ఆ ఆదేశాలు ఎవరిచ్చారో చెప్పాలి? వంటి ప్రశ్నలు తన పోస్టులో ప్రస్తావించారు.

RGV
Chandrababu
Police
Vijayawada

More Telugu News