Kamal Haasan: కనిపించిన వారికల్లా చేయి ఊపుతూ మీ ఓటు మా నాన్నకే అని అడగలేను: శ్రుతిహాసన్

  • మా నాన్నకు మద్దతు తెలిపే పద్ధతి అది కాదు
  • ఆయనది విభిన్నమైన ప్రపంచం
  • ఇప్పటికే ఎంతో మద్దతు లభించింది
ప్రముఖ హీరోయిన్ శ్రుతిహాసన్ తన తండ్రి కమలహాసన్ రాజకీయ ప్రస్థానంపై స్పందించారు. తన తండ్రి రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి ఆయనకు ఓటేయండి అంటూ తాను ఎవర్నీ అడగలేనని స్పష్టం చేశారు. కనిపించిన వారికల్లా చేయి ఊపుతూ మీ ఓటు మా నాన్నకే వేయండి అంటూ ప్రచారం చేయలేనని అన్నారు. ఓ కూతురిగా తన తండ్రికి మద్దతు తెలిపే పద్ధతి అది కాదని భావిస్తున్నట్టు తెలిపారు.

అయినా తనకు రాజకీయాలపై పెద్దగా అవగాహన లేదని, రాజకీయ ప్రపంచం గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలని కోరుకుంటున్నానని శ్రుతి చెప్పారు. తన తండ్రి కమలహాసన్ ది ఎంతో ప్రత్యేకమైన ప్రపంచం అని, ఆయనకు ఇప్పటికే అన్ని వర్గాల నుంచి విశేషమైన మద్దతు లభించిందని అభిప్రాయపడ్డారు.
Kamal Haasan
Shruthi Haasan

More Telugu News