Andhra Pradesh: ‘నాకు జవాబు ఇవ్వకుంటే నారా లోకేశ్ పై ఒట్టే’ అన్న నెటిజన్.. ఫన్నీగా స్పందించిన కేటీఆర్!

  • ట్విట్టర్ లో కేటీఆర్ ముచ్చట్లు
  • ఆస్క్ కేటీఆర్ పేరుతో కార్యక్రమం
  • పలు అంశాలపై టీఆర్ఎస్ నేత మాటామంతీ
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు ట్విట్టర్ లో నెటిజన్లతో పలు అంశాలపై ముచ్చటించారు. ఆస్క్ కేటీఆర్ పేరుతో పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఓ వ్యక్తి కేటీఆర్ పై అలిగాడు. ‘కేటీఆర్.. నేను మీకు 100 ట్వీట్లు చేశా. కానీ మీరు ఒక్క రిప్లై కూడా ఇవ్వలేదు.

ఈసారి జవాబు ఇవ్వకుంటే నారా లోకేశ్ మీద ఒట్టే’ అని హెచ్చరించాడు. తన చర్చా కార్యక్రమంలోకి నారా లోకేశ్ పేరు తీసుకురావడంపై కేటీఆర్ కూడా ఫన్నీగా స్పందించారు. ‘మధ్యలో ఆయన ఏం చేశాడు బ్రదర్?’ అని అడిగారు. కాగా, కేటీఆర్ జవాబుపై నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు.
Andhra Pradesh
Telangana
KTR
Twitter
Nara Lokesh

More Telugu News