Ramgopla Varma: విజయవాడ చేరుకున్న రామ్ గోపాల్ వర్మ... అరెస్ట్ చేసే అవకాశం!

  • నేడు విజయవాడలో వర్మ ప్రెస్ మీట్
  • నడిరోడ్డుపైనే మాట్లాడతానన్న వర్మ
  • ఐలాపురం హోటల్ కు పయనం
తాను తీసిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రాన్ని మే 1న ఏపీలో విడుదల చేయాలని నిర్ణయించుకున్న వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, నేడు విజయవాడలో నడిరోడ్డుపై మీడియా సమావేశం పెట్టనున్నట్టు వెల్లడించి కలకలం రేపిన సంగతి తెలిసిందే. చెప్పినట్టుగానే, ఈ ఉదయం 11.30 గంటలకు స్పైస్ జెట్ విమానంలో రామ్ గోపాల్ వర్మ విజయవాడకు చేరుకున్నారు. అక్కడి నుంచి ఐలాపురం హోటల్ కు పయనం అయ్యారు. తాను 12.30 గంటల సమయంలో ఐలాపురం హోటల్ కు వెళ్లనున్నట్టు ఆయన తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు.

కాగా, రహదారులపై ప్రెస్ మీట్ కు అనుమతి లేని కారణంగా, పోలీసులు వర్మను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. వర్మ ప్రెస్ మీట్ ను అడ్డుకునేందుకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రయత్నించవచ్చని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా, వర్మ ప్రెస్ మీట్ పెడతానని పేర్కొన్న ప్రాంతంలో భద్రతను పెంచారు. అక్కడికి వర్మ వస్తే అదుపులోకి తీసుకుని, తరలించే అవకాశాలు ఉన్నాయని పోలీసు వర్గాలు వెల్లడించాయి.



Ramgopla Varma
Vijayawada
Lakshmi's NTR

More Telugu News