Rana: సరిగ్గా రెండేళ్ల క్రితం ఇదే రోజు నా జీవితాన్ని మార్చేసింది: హీరో రానా
- 2017, ఏప్రిల్ 28న విడుదలైన బాహుబలి: ది కన్ క్లూజన్
- దాదాపు రూ. 1000 కోట్లకు పైగా వసూళ్లు
- ట్విట్టర్ వేదికగా గుర్తు చేసుకున్న రానా
ఏప్రిల్ 28, 2017... ఈ రోజు ఎవరికైనా గుర్తుంటుందో, ఉండదో గానీ, ఇండియన్ సినీ ఇండస్ట్రీకి, ముఖ్యంగా టాలీవుడ్ కు మాత్రం గుర్తుండి పోతుంది. దాదాపు 1000 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్స్ సాధించి, ఇండియన్ సినిమా స్టామినాను ప్రపంచానికి చూపించిన 'బాహుబలి: ది కన్ క్లూజన్' విడుదలై నేటికి సరిగ్గా రెండేళ్లు.
అంతకు రెండేళ్ల ముందు విడుదలైన 'బాహుబలి' తొలి భాగంలో... బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడన్న ప్రశ్న ఉత్పన్నమై, ఎంతటి చర్చకు దారితీసిందో అందరికీ తెలిసిందే. ఇక 'బాహుబలి' రెండో భాగం వెండితెరను తాకి రెండేళ్లయిన సందర్భాన్ని చిత్రంలో భల్లాలదేవుడి పాత్రలో మెప్పించిన హీరో రానా గుర్తు చేసుకున్నాడు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టాడు. "రెండేళ్ల క్రితం ఈరోజు విడుదలైన ఈ సినిమా నా జీవితాన్ని, చలన చిత్ర పరిశ్రమను మార్చేసింది" అని వ్యాఖ్యానించాడు.

Two years this day changed my life and Indian cinema forever!! #Baahubali pic.twitter.com/XezO0D42I4
— Rana Daggubati (@RanaDaggubati) April 28, 2019