Bollywood: సంజయ్ లీలా భన్సాలీ ఆఫర్ ను తిరస్కరించిన రష్మిక!

  • కొత్త ప్రాజెక్టు చేపట్టిన భన్సాలీ
  • రణ్ దీప్ హుడా ప్రధాన పాత్రలో సినిమా
  • భన్సాలీ ఆఫర్ కు నో చెప్పిన రష్మిక
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీకి హీరోయిన్ రష్మిక మందన షాక్ ఇచ్చింది. ఆయన సినిమాలో నటించేందుకు వచ్చిన ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించింది. బాలీవుడ్ నటుడు రణ్ దీప్ హుడాతో భన్సాలీ ఓ సినిమాను చేస్తున్నారు.

ఈ సినిమాలో ఓ పాత్ర కోసం ఆడిషన్ కు రష్మిక హాజరయింది. కానీ సినిమాలో తన పాత్ర నిడివి తక్కువగా ఉండటంపై రష్మిక అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ కారణంగానే భన్సాలీ తెరకెక్కిస్తున్న సినిమా నుంచి రష్మిక తప్పుకున్నట్లు ఆమె సన్నిహిత వర్గాలు తెలిపాయి.
Bollywood
rashmika mandana
sanjay leela bhansali
rejected offer

More Telugu News