హేమంత్ కర్కరేపై సాధ్వి చేసిన వ్యాఖ్యలు ముమ్మాటికీ తప్పే: మహారాష్ట్ర సీఎం
- తన శాపం వల్లే కర్కరే మృతి చెందారన్న సాధ్వి ప్రజ్ఞ
- తీవ్రంగా తప్పుబట్టిన సీఎం ఫడ్నవిస్
- హేమంత్ దేశం కోసం ప్రాణాలు విడిచారని కొనియాడిన ముఖ్యమంత్రి
సాధ్వి వ్యాఖ్యలపై తాజాగా స్పందించిన సీఎం ఫడ్నవిస్.. హేమంత్ చాలా ధైర్యవంతుడైన అధికారి అని కొనియాడారు. దేశం కోసం ఆయన తన ప్రాణాలను త్యాగం చేశారన్నారు. హేమంత్పై సాధ్వి వ్యాఖ్యలు సరికావన్నారు. సాధ్వికి వ్యక్తిగతంగా ఏమైనా ఫిర్యాదులు ఉంటే ఉండొచ్చని, కానీ వాటిని ఆమె సరైన సమయంలో, సరైన ప్రదేశంలో వ్యక్తీకరిస్తే బాగుండేదని ఫడ్నవిస్ అభిప్రాయపడ్డారు. అయితే, కర్కరేపై చేసిన వ్యాఖ్యలను ఆమె వెనక్కి తీసుకోవడం హర్షించదగ్గ విషయమేనని, కర్కరేపై అటువంటి వ్యాఖ్యలు చేసి ఉండాల్సింది కాదని ఫడ్నవిస్ పేర్కొన్నారు.