Chandrababu: ప్రకృతిని హ్యాండిల్‌ చేసిన మొనగాడు చంద్రబాబు.. ప్రజల పరువు తీయకు స్వామీ!: విజయసాయిరెడ్డి

  • చంద్రం సారు మళ్లీ చిటికెలేశారు
  • నిందలు మోపడానికి సిగ్గనిపించట్లేదా?
  • అన్ని రకాల ప్రలోభాలకు పాల్పడింది మీరే కదా?
  • మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఓటర్లను రఫ్పాడిస్తారట
తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రల్లో తాను ఓటర్లను చైతన్యం చేయబట్టే పోలింగ్ శాతం పెరిగిందని చంద్రం సారు మళ్లీ చిటికెలేశారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. నేడు ఆయన వరుస ట్వీట్లతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

 ‘‘కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రల్లో తాను ఓటర్లను చైతన్యవంతం చేయబట్టే పోలింగు శాతం పెరిగిందని చంద్రం సారు మళ్లీ చిటికెలేశారు. మిగిలిన రాష్ట్రాల్లో కూడా పర్యటించి ఓటర్లను రఫ్పాడిస్తారట. రెండు వారాల్లోనే ఇంత ముదరిపోయిందేమిటి బాబు గారూ? ఏ వైజాగో, ఎర్రగడ్డకో తీసుకెళ్లండయ్యా. ప్రభుత్వాధినేత అయి ఉండి ప్రతిదానికీ ప్రతిపక్షంపై నిందలు మోపడం మీకు సిగ్గనిపించడం లేదా చంద్రబాబూ?

స్ట్రాంగ్‌ రూముల వద్ద సీసీ కెమెరాలు పనిచేయకపోయినా, సీఎస్‌ రిటర్నింగ్‌ అధికారులతో సమీక్ష జరిపినా మాకేం సంబంధం. పోలింగ్ ముగిసేంత వరకు అన్ని రకాల ప్రలోభాలకు పాల్పడింది మీరే కదా? సీఈవో ద్వివేది తన సమీక్షలకు అడ్డు చెప్పడం వల్ల పిడుగులు పడి రాష్ట్రంలో ఏడుగురు చనిపోయారట. తనను పని చేసుకోనిస్తే ఆ ఏడు ప్రాణాలు దక్కేవట. ప్రకృతిని హ్యాండిల్‌ చేసిన మొనగాడు చంద్రబాబు కేంద్ర ఎన్నికల సంఘానికి రాసిన ఫిర్యాదు లేఖలో ప్రస్తావించిన కీలకాంశం ఇది. ప్రజల పరువు తీయమాకు స్వామీ!’’ అని విజయసాయిరెడ్డి ట్వీట్లలో పేర్కొన్నారు.
Chandrababu
vijayasai Reddy
Karnataka
Maharashtra
Tamilnadu
Strong Room

More Telugu News