మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నా.. కుల రాజకీయాల్లోకి నన్ను లాగకండి: మోదీ
- విపక్షాల వల్లే నా కులం గురించి తెలిసింది
- నేనెప్పుడూ కులం గురించి ప్రస్తావించలేదు
- విపక్ష నేతలకు ధన్యవాదాలు
తన వెనుకబాటుతనం గురించి ప్రజలకు తెలియజెప్పినందుకు విపక్ష నేతలకు ధన్యవాదాలు తెలిపారు. పాకిస్థాన్లోని ఉగ్రవాదుల వల్ల భారతదేశానికి ముప్పు ఉందని, ఉగ్రవాదులను అంతమొందించేందుకు ఎస్పీ, బీఎస్పీ నేతల వద్ద ఏమైనా ఉపాయం ఉందా? అని ప్రశ్నించారు. ప్రధాని పదవి కోసం పోటీ పడుతున్న నేతలు దేశ రక్షణ, జవానుల భద్రత విషయంలో మాత్రం నోరు మెదపట్లేదని మోదీ విమర్శించారు. అసలు ఎన్నికల ప్రచారంలోనే ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఒక్కసారి కూడా విపక్ష నేతలు మాట్లాడలేదని విమర్శించారు.