Nani: కేన్సర్ తో నిర్మాత మృతి చెందడం పట్ల హీరో నాని స్పందన

షార్ట్స్‌లో చూడండి
టాలీవుడ్ నిర్మాత అనిల్ కుమార్ మరణంపై హీరో నాని స్పందించారు. తాను సహాయదర్శకుడిగా సినీ రంగంలో కెరీర్ మొదలు పెట్టిన తర్వాత తొలిగా జీతం అందుకుంది అనిల్ కుమార్ చేతుల మీదుగానే అని నాని ట్వీట్ చేశారు. "ఆయన సంతకం చేసి జీతం ఇచ్చారు. అదే నా మొదటి జీతం. ఆయన్ను మా ఫ్యామిలీ మెంబర్ గానే భావిస్తాను. ఎంతో మిస్ అవుతున్నాం సర్. మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను" అని తన ట్వీట్ లో పేర్కొన్నారు.

అల్లరి బుల్లోడు, రాధాగోపాళం వంటి చిత్రాలు నిర్మించిన అనిల్ కుమార్ గత కొంతకాలంగా కేన్సర్ తో బాధపడ్డారు. ఆయన చికిత్స పొందుతూ నిన్న సాయంత్రం తుదిశ్వాస విడిచారు. 
Go Back to Shorts
Nani
Tollywood

More Telugu News