Chandrababu: ప్రధాని పదవికి రాహుల్ గాంధీ కంటే చంద్రబాబే అర్హుడు!: ఎన్సీపీ అధినేత శరద్ పవార్

  • విపక్షాల కూటమిలో మాయావతి, మమత ముందున్నారు
  • ఫలితాలు వచ్చాకే ప్రధాని అభ్యర్థిని నిర్ణయిస్తాం
  • ముంబైలో మీడియాతో మాట్లాడిన నేత
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని పదవికి కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ కంటే టీడీపీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే సరైన వ్యక్తి అని అభిప్రాయపడ్డారు. ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం శరద్ పవార్ మీడియాతో పలు అంశాలపై ముచ్చటించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విపక్షాల కూటమిలో ప్రధాని అభ్యర్థిని ఎంచుకోవాల్సి వస్తే చంద్రబాబు, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, యూపీ మాజీ సీఎం మాయావతి ముందువరుసలో ఉంటారని అభిప్రాయపడ్డారు. ఏదేమయినా సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాతే తాము ప్రధాని అభ్యర్థిని ప్రకటిస్తామని స్పష్టం చేశారు.
Chandrababu
ncp
sarad pawar
Rahul Gandhi
Congress
mayawati
mamata
Prime Minister

More Telugu News