warangal: వరంగల్ మేయర్ గా గుండా ప్రకాశ్ ఏకగ్రీవ ఎన్నిక

  • గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం
  • గుండా ప్రకాశ్ పేరును ప్రతిపాదించిన కార్పొరేటర్లు
  • ఈ మేరకు ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారిక ప్రకటన
గ్రేటర్ వరంగల్  మేయర్ గా గుండా ప్రకాశ్ రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్నికల అధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారిక ప్రకటన చేశారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం ఈరోజు జరిగింది. గుండా ప్రకాశ్ పేరును కార్పొరేటర్లు గణేశ్, అర్షిత రెడ్డి, బయ్యస్వామి ప్రతిపాదించారు. మేయర్ బరిలో ఎవరూ లేకపోవడంతో గుండా ప్రకాశ్ ను ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు. కాగా, ఎన్నికకు ఒకరోజు ముందుగా ప్రకాశ్ రావు పేరును టీఆర్ఎస్ అధికారికంగా ప్రకటించింది. గ్రేటర్ వరంగల్ మేయర్ పదవి జనరల్ కేటగిరికి రిజర్వ్ అయింది. 
warangal
mayor
gunda prakash
corporaters

More Telugu News