Andhra Pradesh: నేడు విశాఖపట్నంకు రానున్న వైఎస్ జగన్!

  • బొత్స సోదరుడి కుమార్తె వివాహానికి హాజరు 
  • రుషికొండ, సాయిప్రియా రిసార్ట్స్ లో వేడుక 
  • అధినేతకు ఘన స్వాగతం పలకడానికి వైసీపీ శ్రేణుల ఏర్పాట్లు 
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఈరోజు విశాఖపట్నంకు రానున్నారు. వైసీపీ నేత బొత్స సత్యనారాయణ సోదరుడు, మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య కుమార్తె యామిని వివాహానికి హాజరుకానున్నారు. విశాఖ నగరానికి చెందిన మునికోటి నిరంజనరావు, విజయలక్ష్మిల కుమారుడు రవితేజతో యామిని వివాహం జరగనుంది.

ఈరోజు విశాఖలోని రుషికొండ సమీపంలో ఉన్న సాయిప్రియా రిసార్ట్స్ లో జరిగిే వేడుకలో పాల్గొని వధూవరులను ఆశీర్వదిస్తారు. అనంతరం రాత్రికి హైదరాబాద్ కు తిరిగి ప్రయాణమవుతారు. కాగా, జగన్ విశాఖ పర్యటన నేపథ్యంలో ఆయనకు ఘనస్వాగతం పలికేందుకు వైసీపీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాయి.
Andhra Pradesh
Visakhapatnam District
YSRCP
Jagan
Hyderabad
Botsa Satyanarayana

More Telugu News