శ్రీలంక బాంబు పేలుళ్ల నుంచి అనిల్ కుంబ్లే తప్పించుకున్న వైనం!
- పేలుడు జరిగిన షాంగ్రి లా హోటల్ లో బస చేసిన కుంబ్లే కుటుంబం
- అల్పాహారం ముగించుకుని యాలా నేషనల్ పార్కుకు పయనం
- అక్కడ ఉండగానే పేలుడు సంభవించినట్టు సమాచారం
బాంబు పేలుళ్లు చోటు చేసుకున్న కొలంబోలోని షాంగ్రి లా హోటల్ లోనే వీరు బసచేశారు. పేలుళ్లు జరిగిన నాటి ఉదయం వారు అల్పాహారం తీసుకున్నారు. అయితే, పేలుడు జరగడానికి గంటల ముందు వారు హోటల్ నుంచి బయటకు వచ్చారు. యాలా నేషనల్ పార్క్ లో వారు ఉండగా... హోటల్ లో బాంబు పేలుడు జరిగినట్టు కుంబ్లేకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో శ్రీలంక పర్యటనను వారు అర్ధాంతరంగా ముగించుకుని, మంగళవారం నాడు బెంగళూరు చేరుకున్నారు.
అనిల్ కుంబ్లే కుటుంబం అల్పాహారం తీసుకున్న ప్రాంతంలోనే సూసైడ్ బాంబర్ తనను తాను పేల్చుకున్నాడు.