Andhra Pradesh: మీ వ్యాఖ్యలు బాధ కలిగించాయి: సీఎస్ కు లేఖలో సీఎం చంద్రబాబు

  • సీఎస్ కు లేఖ రాసిన చంద్రబాబు
  • ‘అధికారాలు లేని సీఎం’ అని అంటారా!
  • సీఎం అధికారాలపై వ్యాఖ్యలు చేసే అధికారం సీఎస్ కు లేదు
ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నేతలు నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా, సీఎస్ కు సీఎం చంద్రబాబు ఓ లేఖ రాశారు. ఓ పత్రికకు సీఎస్ ఇచ్చిన ఇంటర్వ్యూపై వివరణ ఇవ్వాల్సిందిగా ఆ లేఖలో ఆయన కోరారు.

‘అధికారాలు లేని సీఎం’ అని సీఎస్ చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ఇంటర్వ్యూలో సీఎస్ వాడిన భాషపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అఖిల భారత సర్వీసు అధికారుల ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా ఎల్వీ సుబ్రహ్మణ్యం వ్యవహరిస్తున్నారని, సీఎం అధికారాలపై వ్యాఖ్యలు చేసే అధికారం సీఎస్ కు లేదని అన్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు సీఎంకు ఉండే అధికారాల గురించి చెప్పేపని సీఎస్ ది కాదని, ఆయన చేసిన వ్యాఖ్యలు బాధ కలిగించాయని చంద్రబాబు పేర్కొన్నారు.
Andhra Pradesh
CS
CM
Lv subramanyam
babu

More Telugu News