TTD: నేటి ఉదయం 11 గంటల నుంచి 3:30 గంటల వరకు తిరుమల ఆలయం మూసివేత

  • శ్రీవారి ఆలయంలో మహాసంప్రోక్షణ క్రతువు
  • కర్కాటక లగ్నంలో నిర్వహించనున్న పండితులు
  • 3:30 గంటల వరకు స్వామి వారి దర్శనం నిలిపివేత
తిరుమల శ్రీవారి ఆలయంలో నేడు మహాసంప్రోక్షణ జరగనున్న నేపథ్యంలో ఉదయం 11 గంటల నుంచి 3:30 గంటల వరకు ఆలయాన్ని మూసివేయనున్నట్టు టీటీడీ అధికారులు తెలిపారు. వరాహస్వామి ఆలయంలో ఉదయం 11.07 నుంచి మధ్యాహ్నం 1.16 గంటల వరకు కర్కాటక లగ్నంలో ఈ క్రతువు జరగనున్నట్టు పేర్కొన్నారు. అనంతరం ఘంటానాదం, నిత్యకట్ల కైంకర్యాల్లో భాగంగా తోమాల, అర్చన, నైవేద్యం, రెండో గంట తదితర పూజాదికాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. దీంతో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు శ్రీవారి దర్శనాన్ని నిలిపివేయనున్నామని, భక్తులు గమనించాలని కోరారు.  
TTD
Tirumala
Tirupati
Andhra Pradesh

More Telugu News