మహాభారతంలో కౌరవులు ఎదుర్కొన్న పరిస్థితినే బీజేపీ ఎదుర్కోవాల్సి ఉంటుంది: సీతారాం ఏచూరి
- రాజకీయ మహాభారతం నడుస్తోంది
- మోదీ దుర్యోధనుడు, అమిత్ షా దుశ్శాసనుడు
- కేవలం మోదీ, అమిత్ షా పేర్లను గుర్తు పెట్టుకుంటాం
100 మంది ఉన్న కౌరవ సోదరుల్లో మనం దుర్యోధన, దుశ్శాసన పేర్లను మాత్రమే గుర్తు పెట్టుకుంటామన్నారు. అలాగే ప్రపంచంలోని అతిపెద్ద పార్టీ బీజేపీలోనూ కేవలం మోదీ, అమిత్ షా పేర్లను మాత్రమే గుర్తు పెట్టుకుంటామన్నారు. మహా భారతంలో చివరకు కౌరవులు ఎదుర్కొన్న పరిస్థితులనే, దేశంలో జరుగుతున్న రాజకీయ మహా భారతంలోనూ బీజేపీ ఎదుర్కోవాల్సి ఉంటుందని సీతారాం ఏచూరి పేర్కొన్నారు.