Mumbai: భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్

  • చివరి గంటల్లో మరింతగా పెరిగిన కొనుగోళ్లు
  • భారీ లాభాలు దక్కించుకున్న మార్కెట్లు
  • టాటా స్టీల్, బీపీసీఎల్ తదితర సంస్థల షేర్లకు లాభాలు
ఈరోజు స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. బీఎస్సీ సెన్సెక్స్ 336 పాయింట్లు లాభపడి 39,067 వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 112 పాయింట్లు లాభపడి 11,754 పాయింట్ల వద్ద ముగిశాయి. చివరి గంటల్లో కొనుగోళ్లు మరింతగా పెరగడంతో మార్కెట్లకు భారీ లాభాలు దక్కాయి. ఈరోజు ట్రేడింగ్ లో టాటా స్టీల్, బీపీసీఎల్, గెయిల్, ఐసీఐసీఐ బ్యాంకు, జేఎస్ డబ్ల్యూ స్టీల్ తదితర సంస్థల షేర్లు లాభపడ్డాయి. టాటా మోటార్స్, బజాజ్ ఆటో, గ్రాసిమ్, డాక్టర్ రెడ్డీ ల్యాబ్స్, భారతీ ఎయిర్ టెల్ మొదలైన సంస్థల షేర్లు నష్టాలు మూటగట్టుకున్నాయి.
Mumbai
Stockmarket
sensex
Nifty
bajaj auto

More Telugu News