Narendra Modi: మోదీని నామినేట్ చేసిన కాటికాపరి కుటుంబ సభ్యుడు

షార్ట్స్‌లో చూడండి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్ లోని వారణాసి నుంచి మరోసారి ఎన్నికల బరిలో దిగుతున్నారు. గత ఎన్నికల్లో వారణాసి నుంచి భారీ మెజారిటీతో గెలుపొందిన ఆయన రెండో పర్యాయం ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో నేడు నామినేషన్ దాఖలు చేశారు. కాగా, మోదీని ఎంపీ అభ్యర్థిగా ప్రతిపాదించినవారిలో ఓ కాటికాపరి కుటుంబ సభ్యుడు కూడా ఉండడం ఆసక్తి కలిగిస్తోంది. వారణాసిలోని ప్రఖ్యాత మణికర్ణిక ఘాట్ వద్ద దహనసంస్కారాలు నిర్వహించే కుటుంబానికి చెందిన వ్యక్తికి ప్రధాని తనను ప్రతిపాదించే అవకాశాన్ని కల్పించారు.

అంతేగాకుండా, ఆయన పేరును ప్రతిపాదించినవారిలో ఓ వాచ్ మన్, ఓ స్కూలు ప్రధానోపాధ్యాయురాలు, బీజేపీ సీనియర్ నేత కూడా ఉన్నారు. నామినేషన్ దాఖలు చేయడానికి ముందు మోదీ స్థానిక కాలభైరవ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ప్రకాశ్ సింగ్ బాదల్, అన్నపూర్ణ శుక్లా వంటి పెద్దవాళ్లకు మోదీ సనాతన ధర్మం ప్రకారం పాదాభివందనం చేసి నామినేషన్ దాఖలుకు బయల్దేరారు.
Go Back to Shorts
Narendra Modi

More Telugu News