Allu Arjun: 'అలకనంద' టైటిల్ వైపు మొగ్గుచూపుతోన్న త్రివిక్రమ్

  • షూటింగు దశలో అల్లు అర్జున్ మూవీ
  •  ఫ్యామిలీ ఎమోషన్స్ నేపథ్యంలో సాగే కథ
  • టైటిల్ విషయంలో త్రివిక్రమ్ సెంటిమెంట్      
త్రివిక్రమ్ .. అల్లు అర్జున్ కాంబినేషన్లోని సినిమా షూటింగ్ ఇటీవలే మొదలైంది. ఫ్యామిలీ ఎమోషన్స్ చుట్టూ తిరిగే కథ ఇది. కథానాయికగా పూజా హెగ్డేను ఎంపిక చేసుకున్న త్రివిక్రమ్, కీలకమైన పాత్ర కోసం 'టబు'ను ఎంపిక చేసుకున్నాడు. ఈ సినిమాకి 'నాన్న నేను' అనే టైటిల్ ను .. 'అలకనంద' అనే టైటిల్ ను త్రివిక్రమ్ పరిశీలనలోకి తీసుకున్నాడు.

తన సినిమా టైటిల్స్ 'అ' తో మొదలుపెట్టడం ఈ మధ్య త్రివిక్రమ్ సెంటిమెంట్ గా మారింది. ఒక్క 'అజ్ఞాతవాసి' మినహా 'అత్తారింటికి దారేది' .. 'అ ఆ' .. 'అరవింద సమేత' భారీ విజయాలను అందుకున్నాయి. అందువలన ఆ సెంటిమెంట్ ను కొనసాగిస్తూ, ఈ సినిమాకి 'అలకనంద' అనే టైటిల్ ను పెట్టడానికి ఆయన ఆసక్తిని చూపుతున్నాడనే టాక్ ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తోంది. సినిమాలో ఈ పేరుతో కనిపించేది పూజా హెగ్డేనా? 'టబు'నా? అనేది ఆసక్తికరంగా మారింది.
Allu Arjun
pooja hegde

More Telugu News