Rajanikant: షూటింగ్ గ్యాప్ లో క్రికెట్ ఆడిన రజనీకాంత్!

  • ముంబైలో దర్బార్ షూటింగ్
  • విరామ సమయంలో సేదదీరిన రజనీ
  • వైరల్ అవుతున్న చిత్రాలు
దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్, క్రికెట్ ఆడుతూ కాసేపు సేదదీరారు. రజనీ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'దర్బార్' చిత్రం షూటింగ్ ముంబైలో జరుగుతోంది. షూటింగ్ గ్యాప్ లో చిత్ర బృందంతో కలిసి రజనీకాంత్ క్రికెట్ ఆడగా, ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక వీటిని చూసిన రజనీ అభిమానులు "ఇది తలైవా ఐపీఎల్" అంటూ కామెంట్లు చేస్తున్నారు. రజనీతోపాటు హీరోయిన్ నయనతార, కమేడియన్ యోగిబాబు తదితరులు కూడా క్రికెట్ ఆడారు. ఈ చిత్రంలో రజనీకాంత్ పోలీస్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.
Rajanikant
Nayanataara
Darbar
Cricket
Mumbai

More Telugu News