modi: కాసేపట్లో నామినేషన్ వేయనున్న మోదీ.. వారణాసి చేరుకున్న ముఖ్య నేతలు

  • వారణాసిలో నామినేషన్ వేయనున్న మోదీ
  • కాశీ విశ్వనాథ్ ఆలయంలో ప్రధాని పూజలు
  • బీజేపీ ముఖ్య నేతలతో అమిత్ షా భేటీ
ప్రధాన నరేంద్రమోదీ కాసేపట్లో తన నామినేషన్ దాఖలు చేయనున్నారు. యూపీలోని వారణాసి నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. కాసేపటి క్రితం ఆయన కాశీ విశ్వనాథ్ ఆలయం, బాబా కాలభైరవ ఆలయంలో పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయనతో పాటు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, పలువురు నేతలు ఉన్నారు. మోదీ నామినేషన్ నేపథ్యంలో, బీజేపీ ప్రముఖ నేతలు వారణాసి చేరుకున్నారు. వీరందరితో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా భేటీ అయ్యారు. కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, సుష్మాస్వరాజ్, శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
modi
nomination
bjp
varanasi

More Telugu News