Nellore District: ఆత్మకూరు వీవీప్యాట్ స్లిప్పుల కలకలం కేసులో ఇద్దరు అధికారులపై వేటు

  • కొన్ని రోజుల వ్యవధిలో రెండుసార్లు కనిపించిన వీవీప్యాట్ స్లిప్పులు
  • రిటర్నింగ్ అధికారి, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారుల సస్పెన్షన్
  • ఉత్తర్వులు జారీ చేసిన రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని ఓ పాఠశాల ఆవరణలో ఇటీవల కనిపించిన వీవీప్యాట్ స్లిప్పులు కలకలం రేపాయి. కొన్ని రోజుల తేడాలో రెండుసార్లు స్లిప్పులు కనిపించడం చర్చనీయాంశమైంది. ఎన్నికల అధికారుల తీరుపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో స్పందించిన ఎన్నికల కమిషన్ నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు అధికారులను సస్పెండ్ చేసింది. వీరిలో ఆత్మకూరు రిటర్నింగ్ అధికారి ఎస్.చిన్నరాముడు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి పి.విద్యాసాగరుడు ఉన్నారు. ప్రస్తుతం వీరు ఆర్డీవో, ఎమ్మార్వోలుగా ఉన్నారు. వీరిద్దరినీ సస్పెండ్ చేస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్‌సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు.  
Nellore District
Atmakur
vvpat slips
suspension
EC

More Telugu News