చౌకీదార్‌నంటూ మోదీ ఆడుతున్న నాటకాలు ఇక చెల్లవు: మాయావతి
- ఈ ఎన్నికలతో నమో నామస్మరణ ముగుస్తుంది
- అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చింది
- బీజేపీ అన్ని వర్గాలనూ మోసం చేసిందన్న మాయావతి
గత ఎన్నికల్లో అబద్ధపు హామీలనిచ్చి బీజేపీ అధికారంలోకి వచ్చిందని మాయావతి దుయ్యబట్టారు. ఈ ఐదేళ్లలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా అన్ని వర్గాల ప్రజలనూ మోసం చేసిందన్నారు. కాంగ్రెస్ విషయమై మాయావతి మాట్లాడుతూ, కుల రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. ఆ పార్టీ అధికారంలో ఉండగా రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్‌కు భారతరత్న ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్పీ అధినేత అఖిలేష్ భార్య డింపుల్ యాదవ్‌ను, ఎస్పీ-బీఎస్పీ-ఆర్ఎల్డీ కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఆమె ప్రజలను కోరారు.