radharavi: నా మాటలు బాధకలిగించాయని నయనతార అంటే క్షమాపణ చెబుతాను: నటుడు రాధారవి

షార్ట్స్‌లో చూడండి
ఈ మధ్య ఒక వేదికపై నయనతారను గురించి నటుడు రాధారవి చేసిన వ్యాఖ్యలు తీవ్రమైన దుమారాన్ని రేకెత్తించాయి. నయనతార ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తూ రాధారవి అలా మాట్లాడి ఉండకూడదనే విమర్శలను ఆయన ఎదుర్కున్నారు. నయనతార ఎదుగుదలను చూడలేక అక్కసుతోనే ఆయనలా మాట్లాడారనే అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి.

తాజా ఇంటర్వ్యూలో రాధారవి ఈ విషయంపై స్పందించారు. "నయనతార కంటే ముందు నా కళ్లముందు చాలామంది ఎదిగారు. అలా ఎదిగిన వాళ్లలో ఎవరినీ ఎప్పుడూ నేను ఏమీ అనలేదు. నయనతార కంటే తక్కువ పారితోషికం తీసుకున్నంత మాత్రాన నేను మంచి నటుడిని కాకపోను. ఆమెపట్ల అక్కసు పెంచుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు. నయనతార విషయంలో నా వ్యాఖ్యలను కొంతమంది మాత్రమే తప్పుబట్టారు అంటే, మిగతావాళ్లు సమర్ధించినట్టే కదా. నా మాటలు తనకి బాధ కలిగించాయని నయనతార ఎక్కడా చెప్పలేదు .. అలా ఆమె అంటే మాత్రం క్షమాపణ చెబుతాను" అని అన్నారు.
Go Back to Shorts
radharavi
nayanatara

More Telugu News