akhilesh yadav: కాంగ్రెస్ మాకు నమ్మక ద్రోహం చేసింది: అఖిలేశ్ యాదవ్

  • కాంగ్రెస్ కు దురహంకారం చాలా ఎక్కువ
  • పొత్తుకు ఆ పార్టీ విలువ ఇవ్వదు
  • మమ్మల్ని ఎవరైనా మోసం చేశారంటే అది కాంగ్రెస్సే
కాంగ్రెస్ పార్టీపై సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. సమాజ్ వాదీ పార్టీకి ఎవరైనా నమ్మక ద్రోహం చేశారంటే అది కాంగ్రెస్సేనని ఆయన మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ తో తాము పొత్తు పెట్టుకున్నామని... ఆ పార్టీకి దురహంకారం చాలా ఎక్కువని, పొత్తులకు విలువ ఇవ్వదని దుయ్యబట్టారు. ప్రస్తుత లోక్ సభ ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీలతో కలసి కాంగ్రెస్ కూటమి ఏర్పాటు చేస్తుందని అందరూ భావించినా... బీఎస్పీతో పొత్తు పెట్టుకున్న అఖిలేశ్ యాదవ్... కాంగ్రెస్ పార్టీని దూరంగా ఉంచారు.

2017 శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎస్పీ కలసి పోటీ చేశాయి. అయితే, ఎన్నికల ఫలితాలు వ్యతిరేకంగా వచ్చిన తర్వాత ఇరు పార్టీల మధ్య అంతరం పెరిగింది.
akhilesh yadav
sp
bsp
congress

More Telugu News