Andhra Pradesh: విశాఖపట్నం కలెక్టర్ కారణంగా 4,000 మంది ఉద్యోగులు ఓటేయలేకపోయారు!: వైసీపీ నేత దాడి వీరభద్రరావు

  • పోస్టల్ బ్యాలెట్ల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారు
  • ఇలాగైతే కౌంటింగ్ రోజూ ఇబ్బందులు తప్పవు
  • విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన వైసీపీ నేత
విశాఖపట్నం జిల్లా కలెక్టర్ భాస్కర్ పై వైసీపీ నేత దాడి వీరభద్రరావు తీవ్రంగా మండిపడ్డారు. పోస్టల్ బ్యాలెట్ పంపిణీ విషయంలో కలెక్టర్ పూర్తి నిర్లక్ష్యంతో వ్యవహరించారని ఆరోపించారు. దీనివల్ల 4,000 మంది ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నంలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో దాడి వీరభద్రరావు మాట్లాడారు.

ఇతర జిల్లాల కలెక్టర్లకు భిన్నంగా భాస్కర్ వ్యవహరిస్తున్నారని దాడి దుయ్యబట్టారు. ఇదే పరిస్థితి కొనసాగితే కౌంటింగ్ సందర్భంగా కూడా ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. ఇప్పటివరకూ ఇచ్చిన పోస్టల్ బ్యాలెట్ వివరాలను కలెక్టర్ బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. కౌంటింగ్ ను నిష్పక్షపాతంగా కొనసాగించాలన్నారు.
Andhra Pradesh
Visakhapatnam District
YSRCP
dadi
veerabhadrarao
postal ballot

More Telugu News