Telangana: గ్లోబరినా ఉపయోగించిన సాఫ్ట్ వేర్ లోనే లోపాలు... అందుకే ఇంటర్ మార్కులలో తప్పులతడకలు: త్రిసభ్య కమిటీ

  • సాఫ్ట్ వేర్ మార్చకపోతే రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ లో కూడా తప్పులొస్తాయి
  • ఆసక్తికర అంశాలు గుర్తించిన కమిటీ
  • కొనసాగుతున్న విచారణ
తెలంగాణలో మునుపెన్నడూ లేనంతగా ఇంటర్మీడియట్ మార్కుల వ్యవహారం అనేకమంది విద్యార్థుల జీవితాలను ప్రభావితం చేస్తోంది. ఊహించని విధంగా ఫెయిల్ కావడంతో ఇప్పటికే చాలా మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. దాంతో, ఈ వ్యవహారంపై నిగ్గు తేల్చేందుకు తెలంగాణ సర్కారు త్రిసభ్య కమిటీ నియమించింది. ఈ కమిటీ విచారణలో ఆసక్తికర అంశాలు బయటపడ్డాయి.

ఇంటర్ మార్కుల్లో తీవ్ర గందరగోళానికి కారణమైన గ్లోబరినా టెక్నాలజీ సంస్థ ఉపయోగించిన సాఫ్ట్ వేర్ లోనే లోపాలు ఉన్నట్టు గుర్తించారు. ఈ సాఫ్ట్ వేర్ ను మార్చకపోతే రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ చేసినా ప్రయోజనం ఉండదని, మళ్లీ అదే రీతిలో మార్కులు తప్పులతడకలుగా వస్తాయని త్రిసభ్య కమిటీ సభ్యులు భావిస్తున్నారు. విచారణలో భాగంగా తాము తెలుసుకున్న అంశాలతో పూర్తి నివేదికను ఇవాళ సాయంత్రం ప్రభుత్వానికి సమర్పించనున్నారు.
Telangana

More Telugu News