Sri Lanka: శ్రీలంకలో చర్చిలన్నీ మూసివేత.. మతపెద్దల కీలక నిర్ణయం!

  • ఇటీవల ఉగ్రదాడులతో నెత్తురోడిన శ్రీలంక
  • 359  మంది దుర్మరణం, 500 మందికి గాయాలు
  • రక్షణ శాఖ సూచనతో చర్యలు తీసుకున్న మతపెద్దలు
శ్రీలంకలో ఇటీవల ఉగ్రమూకలు సృష్టించిన మారణకాండతో 359 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈస్టర్ రోజున చర్చిలు, విలాసవంతమైన ఫైవ్ స్టార్ హోటళ్లే లక్ష్యంగా ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడులకు తెగబడ్డారు. ఈ నేపథ్యంలో శ్రీలంక క్రైస్తవ మతపెద్దలు కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న క్యాథలిక్ చర్చిల్లో ప్రార్థనలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.

ఈ విషయమై సీనియర్ మతబోధకుడు ఒకరు మీడియాతో మాట్లాడుతూ.. చర్చిల వద్ద భద్రతను పెంపొందించాల్సిన అవసరం ఉందని తెలిపారు. అందులో భాగంగా రక్షణ ఏర్పాట్లను కల్పిస్తున్నామన్నారు.  ఈ క్రమంలో రక్షణ శాఖ సూచన మేరకు చర్చిలను కొన్ని రోజులు మూసివేస్తున్నామని చెప్పారు. ప్రజలంతా ఈ ఆదివారం ఇళ్ల దగ్గరే ప్రార్థనలు చేసుకోవాలని సూచించారు. తాము చెప్పేవరకూ ప్రజలు చర్చిలకు రావొద్దని కోరారు. శ్రీలంక ఉగ్రదాడిలో దాదాపు 500 మంది గాయపడగా, వీరిలో చాలామంది పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది.
Sri Lanka
attack
terror
churches
closed

More Telugu News