inter: ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై నాని ఎమోషనల్ ట్వీట్

  • మార్కుల కంటే జీవితంలో విలువైనవి చాలా ఉన్నాయి
  • తల్లిదండ్రుల గురించి ఆలోచించండి
  • వారు మీ మార్కులను కాదు.. మిమ్మల్నే ప్రేమిస్తున్నారు
తెలంగాణ ఇంటర్ ఫలితాలు విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నాయి. బోర్డు అవకతవకల కారణంగా పలువురు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఆత్మహత్యలపై సినీ హీరో నాని స్పందించాడు. చదువంటే మార్కుల పత్రాలు కాదని, నేర్చుకోవడం మాత్రమేనని చెప్పాడు. అర్హత సాధించని ప్రతిసారి మరోసారి ప్రయత్నించాలని సూచించాడు. మార్కుల కంటే జీవితంలో విలువైనవి చాలా ఉన్నాయని అన్నాడు. మిమ్మల్ని అమితంగా ప్రేమించే తల్లిదండ్రుల గురించి ఆలోచించాలని హితవు పలికాడు. ఇంటర్ ఫలితాలను చూసి వారు మిమ్మల్ని ప్రేమించడం లేదని, మిమ్మల్ని చూసే ప్రేమిస్తున్నారని ట్వీట్ చేశాడు.
inter
students
suicide
nani
tollywood

More Telugu News