vijay devarakonda: చేతిలో ఫోన్ లేకుండా బతకడం నా వల్ల కాదు: విజయ్ దేవరకొండ

  • డబ్బులు లేకపోయినా బతికేస్తాను 
  • ఎప్పుడూ చేతిలో ఫోన్ ఉండాల్సిందే 
  • వంటకాల విషయంలో ఇష్టాలు మారతాయి
టాలీవుడ్ లోని యువ కథానాయకులకు విజయ్ దేవరకొండ గట్టి పోటీ ఇస్తున్నాడు. వరుస విజయాలతో .. తనదైన బాడీ లాంగ్వేజ్ తో యూత్ లో విపరీతమైన క్రేజ్ ను తెచ్చుకున్నాడు. అలాంటి విజయ్ దేవరకొండ తాజా ఇంటర్వ్యూలో తన లైఫ్ స్టైల్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చాడు.

"నా దగ్గర డబ్బులు లేకపోయినా ఎలాగో అలా బతికేస్తాననే నమ్మకం కుదిరింది. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో నా దగ్గర డబ్బులు లేనప్పుడు, అక్కడే వున్న అభిమానులు నాకు సంబంధించిన బిల్స్ ను చెల్లించేశారు. అందువలన అభిమానాన్ని సంపాదించుకుంటే చాలనే విషయం నాకు అర్థమైంది. ఇక డబ్బులు లేకపోయినా బతికేస్తానుగానీ, చేతిలో ఫోన్ లేకుండగా క్షణం కూడా బతకలేను. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చేతిలో సెల్ ఫోన్ ఉండటం చాలా అవసరం .. కొన్ని సందర్భాల్లో అది అత్యవసరం. అందువలన ఫోన్ మాత్రం చేతిలో ఉండాల్సిందే. ఇక వంటకాల విషయానికొస్తే, వాటి విషయంలో నా ఇష్టాలు ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి" అని ఆయన చెప్పుకొచ్చాడు.
vijay devarakonda

More Telugu News