Mahesh Babu: 'మహర్షి' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథులుగా ఎన్టీఆర్, చరణ్?

  • మే 1న ప్రీ రిలీజ్ ఈవెంట్ 
  • మే 9న సినిమా విడుదల 
  • 'పదరా ..' సాంగ్ కి మంచి రెస్పాన్స్
మహేశ్ బాబు .. వంశీ పైడిపల్లి కాంబినేషన్లో రూపొందిన 'మహర్షి' సినిమా, వచ్చేనెల 9వ తేదీన భారీస్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ లోగా .. అంటే మే 1వ తేదీన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజా ఇందుకు వేదికగా మారనుంది.ఈ వేడుకకి ముఖ్య అతిథిగా ఎవరు రానున్నారనే ఆసక్తి అభిమానుల్లో పెరిగిపోతోంది. ఎన్టీఆర్ గానీ చరణ్ గాని ముఖ్య అతిథిగా రావొచ్చనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. ఎన్టీఆర్ .. చరణ్ ఇద్దరూ కూడా మహేశ్ బాబుకి మంచి స్నేహితులు కావడం వలన, ఇద్దరూ వచ్చే అవకాశం కూడా లేకపోలేదని చెప్పుకుంటున్నారు. అదే జరిగితే అభిమానులకి అంతకిమించిన పెద్ద పండుగ ఉండదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఈ సినిమా నుంచి నిన్న వదిలిన 'పదరా ..  పదరా' అనే సాంగ్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది.
Mahesh Babu
pooja hegde

More Telugu News