devineni Uma: పసుపు-కుంకుమ డబ్బులు మహిళలకు అందకుండా వైసీపీ నేతల కుట్రలు: మంత్రి దేవినేని ఆరోపణ

  • దేవాలయాల పవిత్రత గురించి, బంగారం గురించి వైసీపీ నేతలు మాట్లాడడం విడ్డూరం
  • వాస్తవాలు ప్రజల ముందుకు తెస్తున్నారనే కుటుంబరావుపై వ్యక్తిగత దాడి
  • వృద్ధుల పెన్షన్లపైనా వైసీపీ నేతల కుట్రలు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత విజయసాయి రెడ్డి వాడుతున్న భాష దుర్మార్గంగా ఉందని ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. అమరావతిలో విలేకరులతో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు. దేవాలయాల పవిత్రత గురించి, బంగారం గురించి బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్లానింగ్ కమిషన్ ఉపాధ్యక్షుడు కుటుంబరావు తన విధులను చాలా నిబద్ధతతో నిర్వహిస్తుంటే ఆయనపైనా బురద జల్లుతున్నారని అన్నారు. ఎప్పటికప్పుడు అన్ని విషయాలపైనా వాస్తవాలను ప్రజల ముందు ఉంచుతున్న ఆయనపై అక్కసుతో వ్యక్తిగత దాడికి దిగుతున్నారని అన్నారు. ఇవన్నీ అటెన్షన్ డైవర్షన్ బ్యాచ్ పనులేనని అన్నారు.

వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపుపై చంద్రబాబు దేశ వ్యాప్తంగా చర్చను లేవనెత్తారని, అన్ని పార్టీలను కదిలించారని అన్నారు. చంద్రబాబు చేస్తున్నఈ ప్రయత్నంపైనా వైసీపీ నేతలు దుర్మార్గంగా మాట్లాడుతున్నారని అన్నారు. వైసీపీ నేతలు బెదిరింపు ధోరణితో ఉన్నారని, పసుపు-కుంకుమ డబ్బులు మహిళలకు అందకుండా కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. వృద్ధుల పెన్షన్లపైనా కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు.
devineni Uma
Andhra Pradesh
YSRCP
Vijayasair reddy

More Telugu News