చితక్కొట్టిన బంగ్లాదేశ్ క్రికెటర్ సౌమ్య సర్కార్.. 16 సిక్సర్లతో 208 నాటౌట్
- డీపీఎల్లో బంగ్లాదేశ్ క్రికెటర్ అరుదైన చరిత్ర
- తొలి వికెట్కు 312 పరుగుల భాగస్వామ్యం
- డీపీఎల్ ట్రోఫీని ఎగరేసుకుపోయిన అబహానీ జట్టు
మరో ఓపెనర్ జహురుల్ ఇస్లాంతో కలిసి సౌమ్య సర్కారు తొలి వికెట్కు 312 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. వంద బంతులు ఎదుర్కొన్న జహురుల్ 128 పరుగులు చేశాడు. డబుల్ సెంచరీ బాదిన సౌమ్య సర్కార్ అరుదైన రికార్డును తన పేర లిఖించుకున్నాడు. లిస్ట్-ఎ క్రికెట్లో ఈ ఘనత సాధించిన తొలి బంగ్లాదేశ్ క్రికెటర్గా రికార్డులకెక్కాడు. 2017లో అకీబుల్ హసన్ 190 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు అదే అత్యుత్తమం కాగా, ఇప్పుడా రికార్డును సౌమ్య సర్కార్ తిరగరాశాడు.