West Bengal: అలాంటి వాళ్లూ ప్రధాని పీఠం కోసం తాపత్రయ పడుతున్నారు!: మమతపై మోదీ సెటైర్లు

  • నా పర్యటనల వల్ల విదేశాల్లో దేశ ప్రతిష్ట పెరిగింది
  • అంతర్జాతీయ స్థాయిలో మన గళం విన్పిస్తున్నాం
  • పశ్చిమ బెంగాల్ లో మమత కథ ముగిసినట్టే
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ప్రధాని మోదీ విరుచుకుపడ్డారు. బెంగాల్ లోని బిర్భూమ్ జిల్లాలో బీజేపీ నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, తక్కువ సీట్లలో పోటీ చేసే వాళ్లు కూడా ప్రధాని పీఠం కోసం తాపత్రయ పడుతున్నారని విమర్శించారు. ఈ సందర్భంగా తనపై మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలకు ఘాటుగా మోదీ స్పందించారు.

 ‘విదేశాల్లో విహరిస్తూ చాయ్ వాలా బిజీ అయ్యారు’ అన్న మమత వ్యాఖ్యలపై మోదీ స్పందిస్తూ, తన పర్యటనల వల్ల దేశ ప్రతిష్ట పెరిగిందని, సమస్యలు, సవాళ్లపై మాట్లాడేందుకు భారత్ ఒకప్పుడు భయపడేదని, ఇప్పుడు అలాంటి భయం లేకుండా అంతర్జాతీయ స్థాయిలో గళం విప్పుతోందని అన్నారు. పశ్చిమ బెంగాల్ లో మమత కథ ముగిసినట్టేనంటూ వార్తలు వస్తున్న విషయాన్ని మోదీ ప్రస్తావించడం గమనార్హం.
West Bengal
mamata
cm
modi
pm

More Telugu News