Bollywood: అక్షయ్ కన్నా గొప్ప నటుడిని కావాలని మోదీ భావిస్తున్నారు: కాంగ్రెస్ నేత రణ్ దీప్

  • ఈ ఎన్నికల్లో మోదీ ఓటమి ఖాయం
  • కొత్త ఉద్యోగం వెతుక్కునే పనిలో మోదీ ఉన్నారు
  • మోదీ హయంలో ఆర్థిక వ్యవస్థ నాశనమైంది
ప్రధాన మంత్రి మోదీని బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఇంటర్వ్యూ చేసిన వీడియో టీవీ ఛానెళ్లలో ప్రసారమైన విషయం తెలిసిందే. ఈ ఇంటర్వ్యూలో అక్షయ్ అడిగిన పలు ప్రశ్నలకు మోదీ ఆసక్తికర సమాధానాలు ఇవ్వడం గమనించవచ్చు. అయితే, ఈ ఇంటర్వ్యూపై కాంగ్రెస్ పార్టీ నేత రణ్ దీప్ సుర్జేవాలా విమర్శలు గుప్పించారు.

ఢిల్లీలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ ఎన్నికల్లో మోదీ ఓటమి ఖాయమని జోస్యం చెప్పారు. ఓడిపోతామని తెలిసిన మోదీ, బాలీవుడ్ లో కొత్త ఉద్యోగం వెతుక్కునే పనిలో ఉన్నారని, అక్షయ్ కంటే గొప్ప నటుడిని కావాలని మోదీ భావిస్తున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాజకీయాల్లో ఓటమి పాలైన వ్యక్తి నటుడిగా రాణించడం కూడా కష్టమేనని వ్యాఖ్యానించారు.

మోదీ హయంలో దేశంలోని వ్యవస్థలను నవ్వులపాలు చేశారని, ఆర్థిక వ్యవస్థను నాశనం చేశారని నిప్పులు చెరిగారు. నిరుద్యోగ యువతకు, పేదలకు, రైతులకు మోదీ పాలనలో నరకం కనబడిందని, పెద్దనోట్ల రద్దు సమయంలో దేశ కరెన్సీని దోచుకున్నారని, ఓ విఫల నేతగా మోదీగా మిగిలిపోయారని వ్యాఖ్యానించారు.
Bollywood
Ranadeepsurjewala
pm
modi

More Telugu News