Vijayasai Reddy: విజయసాయి కన్ను టీటీడీ ఆభరణాలపై పడింది: బుద్ధా వెంకన్న

  • విజయసాయికి మతి భ్రమించింది 
  • ఆరోపణలు చేస్తే మూల్యం చెల్లించక తప్పదు
  • చంచల్‌గూడ జైల్లో స్వాగతం చెప్పడానికి దొంగలు సిద్ధం
వైసీపీకి సర్వే చేసిన పీకే ఎన్నికల అనంతరం చేతిలో చెక్క బోర్డు పెట్టి పారిపోయాడని, దీంతో ఏం చేయాలో దిక్కు తోచక విజయసాయిరెడ్డికి మతి భ్రమించి ఏవేవో మాట్లాడుతున్నారని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఎద్దేవా చేశారు. విజయసాయి కన్ను టీటీడీ ఆభరణాలపై పడిందని, టీటీడీ వంటి పవిత్ర క్షేత్రంపై ఆరోపణలు చేస్తే తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు.

ఏడు కొండలను రెండు కొండలన్న వారి చోటికే విజయసాయి కూడా వెళతారని బుద్దా వెంకన్న వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో టీటీడీ ఆభరణాలను దొంగిలించి నిందను తమపై రాకుండా చూసుకునేందుకు ఇప్పటి నుంచే ప్లాన్ ప్రకారం వెళుతున్నారని ఆరోపించారు. ఎన్నికల అనంతరం చంచల్‌గూడ జైల్లో విజయసాయికి దొంగలు స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.
Vijayasai Reddy
Budha Venkanna
TTD
PK
YSRCP

More Telugu News