మరో మైలురాయిని అధిగమించిన కాళేశ్వరం ప్రాజెక్టు.. కేసీఆర్ హర్షం
- విజయవంతమైన భారీ మోటార్ రన్
- రిజర్వాయర్లోకి నీటి విడుదల
- అధికారులకు కేసీఆర్ అభినందనలు
ఈ క్రమంలో కాళేశ్వరం మొదటి పంపు వెట్ రన్ విజయవంతం కావడంతో సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు పనుల్లో పాలు పంచుకున్న అధికారులకు కేసీఆర్ అభినందనలు తెలిపారు. కాళేశ్వరం నుంచి నీటిని ఎత్తిపోసి 40 లక్షల ఎకరాలకు నీళ్లందిస్తామని కేసీఆర్ మరోమారు ప్రకటించారు. తెలంగాణ రైతుల తలరాతలు మార్చే ప్రాజెక్టుగా కాళేశ్వరాన్ని అభివర్ణించారు.