కవిత చిల్లర రాజకీయాలు చేస్తున్నారు: ధర్మపురి అరవింద్
- మోదీపై పోటీ చేస్తామంటున్న రైతులెవరూ పసుపు పండించరు
- వారణాసికి వెళ్లడానికి వీరికి టికెట్లు ఎవరు సమకూర్చుతున్నారు?
- టీఆర్ఎస్ ప్యాకేజీలో భాగంగానే నామినేషన్లు వేస్తున్నారు
మోదీపై పోటీ చేస్తామంటున్న రైతులెవరూ పసుపు పండించరని అరవింద్ చెప్పారు. వారణాసికి వెళ్లడానికి వీరందరికీ టికెట్లు ఎవరు సమకూర్చుతున్నారని ప్రశ్నించారు. ప్యాకేజీలో భాగంగానే వీరు నామినేషన్లు వేస్తున్నారని అన్నారు. పసుపు బోర్డు కోసం కవిత చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. బోర్డు ఏర్పాటు చేస్తామని బీజేపీ మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ రాజ్ నాథ్ సింగ్ హామీ ఇచ్చారని చెప్పారు. బీజేపీ హామీని జీర్ణించుకోలేకే కవిత చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు.