Chandrababu: దేవుడి సొమ్మును కాజేసే నీచబుద్ధి చంద్రబాబుది: విజయసాయిరెడ్డి

  • బాబు హయాంలో ఆలయాలకు రక్షణ లేదు
  • బాబు హయంలో ఐదుగురు సీఎస్ లుగా పని చేశారు
  • అందులో ముగ్గురు బాబు తీరును తప్పుబట్టారు
చంద్రబాబు హయాంలో దేవాలయాలకు రక్షణ లేకుండా పోయిందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అనేక దేవాలయాలు, మసీదులు, చర్చిలను కూలగొట్టారని, దేవుడి సొమ్మును కాజేసే నీచబుద్ధి చంద్రబాబుది అని ఆరోపించారు. సదావర్తి భూములను ఎందుకు విక్రయించాల్సి వచ్చింది? టీటీడీ బంగారం విషయంలో బాబు ఎందుకు స్పందించడం లేదు? అని ప్రశ్నించారు. టీటీడీ ప్రధాన అర్చకులను తొలగించారని, యనమల వియ్యంకుడిని టీటీడీ చైర్మన్ గా నియమించారని, దొంగతనం, దోపిడీ చేయడానికే ఇవన్నీ చేశారన్న విషయం స్పష్టంగా అర్థమవుతోందని విమర్శించారు.

చంద్రబాబు హయాంలో ఐదుగురు సీఎస్ లుగా పని చేస్తే, ముగ్గురు సీఎస్ లు ఆయన పనితీరును తప్పుబట్టారని విమర్శించారు. గోవిందరాజస్వామి ఆలయంలో కిరీటాలు మాయమయ్యాయని, ఏ ఇంట్లో సోదా చేస్తే ఆ కిరీటాలు దొరుకుతాయో పోలీసులకు తెలుసని, అయినప్పటికీ, ఇద్దరు జేబుదొంగలను పట్టుకుని ఆ కేసును పక్కదారి పట్టిస్తున్నారని విమర్శించారు.
Chandrababu
Telugudesam
vijayasai reddy
YSRCP
ttd

More Telugu News