Andhra Pradesh: విజయసాయిరెడ్డి ఓ లోఫర్-లఫూట్-లఫంగా బ్యాచ్!: కుటుంబరావు ఘాటు విమర్శలు

  • ఆయనకు సిగ్గు, శరం లేవు 
  • ఘోరమైన భాష వాడుతున్నారు
  • అమరావతిలో మీడియాతో ఏపీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు
వైసీపీ నేత విజయసాయిరెడ్డికి సిగ్గు, శరం లేవని ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు విమర్శించారు. తెలంగాణలో ఓ వ్యక్తి తనతో మాట్లాడుతూ..‘మా దగ్గర మూడు కేటగిరీలు ఉంటాయండీ. ఎల్1 అంటే లోఫర్, ఎల్2 అంటే లోఫర్-లఫూట్, ఎల్3 అంటే లోఫర్-లఫూట్-లఫంగా అని నేతలకు గ్రేడింగ్ ఇస్తాం’ అని చెప్పాడన్నారు. ప్రస్తుతం చూస్తే విజయసాయిరెడ్డి ఈ మూడో కేటగిరిలోకి వస్తాడని అనిపిస్తోందని దుయ్యబట్టారు. దేశంలో విజయసాయిరెడ్డి వాడుతున్న భాష కంటే ఘోరంగా ఏ నేతలు కూడా వాడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో కుటుంబరావు మాట్లాడారు.

విజయసాయిరెడ్డి ఓ మానసిక రోగంతో బాధపడుతున్నారని కుటుంబరావు విమర్శించారు. దీనినుంచి ఆయన బయటకు రావాల్సిన అవసరం ఉందన్నారు. విజయసాయిరెడ్డి ఆడిటర్ గా ఉన్న జగతి పబ్లికేషన్స్ ఇప్పటివరకూ డివిడెండ్ చెల్లించిందా? అని ప్రశ్నించారు. వరంగల్, రంగారెడ్డి కోర్టుల్లో తనపై కేసులు ఉన్నట్లు చెబుతున్న నేతలు, వాటిపై ఆధారాలు చూపాలన్నారు. ఏపీలో బీజేపీ కంటే నోటాకు ఎక్కువ ఓట్లు వస్తాయని అనిపిస్తోందని ఎద్దేవా చేశారు. తాను కష్టపడి సంపాదించాననీ, అందువల్లే జాగ్రత్తగానే పెట్టుబడి పెడతానని వ్యాఖ్యానించారు. విజయసాయిరెడ్డిలా ఇతర కంపెనీలను ప్రభావితం చేసి డబ్బులు దొబ్బేయలేదని స్పష్టం చేశారు. విజయసాయిరెడ్డి తెలంగాణ ఎల్3 బ్యాచ్ అని దుయ్యబట్టారు.
Andhra Pradesh
YSRCP
Vijay Sai Reddy
Telugudesam
kutumbarao

More Telugu News