వీవీప్యాట్ పై వెనక్కి తగ్గని ప్రతిపక్షాలు.. మళ్లీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు!
- 50 శాతం వీవీప్యాట్లు లెక్కింపునకు కాంగ్రెస్, టీడీపీ పట్టు
- రివ్యూ పిటిషన్ దాఖలు చేసిన 21 ప్రతిపక్ష పార్టీలు
- గతంలో పిటిషన్ ను తిరస్కరించిన సుప్రీంకోర్టు
గతంలో ఇదే ప్రతిపాదనతో ప్రతిపక్షాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. అయితే ఈ ప్రతిపాదనను తిరస్కరించిన సుప్రీం ప్రతీ లోక్ సభ నియోజకవర్గంలోని ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్ లో ఐదు వీవీప్యాట్ల చొప్పున లెక్కించాలని ఆదేశించింది. అయితే దీనిపై సంతృప్తి చెందని పార్టీలు మరోసారి అత్యున్నత న్యాయస్థానం తలుపు తట్టాయి.