నాని తదుపరి సినిమా ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు
- 'జెర్సీ'తో హిట్ కొట్టిన నాని
- విక్రమ్ కుమార్ తో 'గ్యాంగ్ లీడర్'
- తదుపరి సినిమాకి సన్నాహాలు
ఈ నెల 26వ తేదీన ఈ సినిమాను లాంచ్ చేయనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాకి 'వ్యూహం' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. కానీ వేరే టైటిల్ ఖరారు చేశారని తెలుస్తోంది. సినిమాను లాంచ్ చేసిన రోజునే టైటిల్ లోగోతో కూడిన ఫస్టులుక్ ను వదిలే ఆలోచనలో వున్నారని సమాచారం. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో నాని సరసన అదితీరావు .. సుధీర్ బాబు జోడీగా నివేదా థామస్ నటించనున్నారు.