Rahul Gandhi: ఢిల్లీలో మారిన రాజకీయం... కాంగ్రెస్ లో చేరిన బీజేపీ ఎంపీ!

  • సిట్టింగ్ ఎంపీకి టికెట్ నిరాకరించిన బీజేపీ
  • వెంటనే కాంగ్రెస్ లో చేరిన ఉదిత్ రాజ్
  • స్వయంగా ఆహ్వానించిన రాహుల్ గాంధీ
ఢిల్లీ బీజేపీ నేత, ఎంపీ ఉదిత్ రాజ్ అనూహ్య పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014 ఎన్నికల్లో ఈశాన్య ఢిల్లీ నుంచి ఎంపీగా గెలిచిన ఆయనకు, ఈ దఫా టికెట్ నిరాకరించిన నేపథ్యంలో, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిసిన ఉదిత్ రాజ్, కాంగ్రెస్ కండువాను కప్పుకున్నారు. ఉదిత్ రాజ్ తమ పార్టీలో చేరినట్టు కాంగ్రెస్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది. ఆయన్ను రాహుల్ గాంధీ సాదరంగా ఆహ్వానించారని పేర్కొంది.
Rahul Gandhi
Udit Raj
BJP
Congress

More Telugu News