RRR: 'ఆర్ఆర్ఆర్' షూటింగులో ఎన్టీఆర్‌ కు స్వల్ప గాయం!

  • ఇప్పటికే రామ్ చరణ్ కు గాయం
  • మూడు వారాలు ఆగిన షూటింగ్
  • తాజాగా ఎన్టీఆర్ కుడి చేతికి గాయం
దర్శక దిగ్గజం రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోలుగా తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్‌ 'ఆర్‌ఆర్‌ఆర్‌' టీమ్ కు మరో షాక్ తగిలింది. ఇటీవల పూణేలో షూటింగ్ జరుగుతున్న వేళ, రామ్‌ చరణ్‌ గాయపడగా, షూటింగ్‌ మూడు వారాల పాటు వాయిదా పడ్డ సంగతి తెలిసిందే.

తాజాగా షూటింగ్ హైదరాబాద్‌ లో ప్రారంభం కాగా, తాజాగా, ఎన్టీఆర్‌ కూడా గాయపడ్డాడు. ఆయన కుడి చేతికి గాయం అయినట్టు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న ఫోటోలు చెబుతున్నాయి. అయితే, ఈ గాయం మరీ పెద్దదేమీ కాదని తెలుస్తోంది. చేతికి కట్టుతోనే ఎన్టీఆర్ షూటింగ్ కు వస్తున్నట్టు చిత్ర యూనిట్ వెల్లడించింది. రామ్‌ చరణ్‌ సరసన బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ నటిస్తుండగా ఎన్టీఆర్‌ కు జోడీగా ఇంకా ఎవరినీ తీసుకోలేదు. తొలుత బాలీవుడ్ నటి డైసీని ప్రకటించినప్పటికీ, ఆపై ఆమె ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది.
RRR
NTR
Wond
Ramcharan
Rajamouli

More Telugu News