ఏపీలో జరిగిన పోలింగ్ ఏకపక్షమే.. టీడీపీ అధికారంలోకి రాబోతోంది!: మంత్రి అయ్యన్నపాత్రుడు
- రాష్ట్రాన్ని దోపిడీదారుల చేతుల్లో పెట్టవద్దని కోరుకున్నా
- మహిళలు అంతా టీడీపీ వెంటే ఉన్నారు
- తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టీడీపీ నేత
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని దోపిడీదారుల చేతుల్లో పెట్టవద్దని శ్రీవేంకటేశ్వర స్వామిని కోరుకున్నట్లు తెలిపారు. అలాగే ముఖ్యమంత్రిగా మళ్లీ చంద్రబాబే రావాలని స్వామివారిని ప్రార్థించినట్లు చెప్పారు. ఏపీలో మహిళలు అంతా టీడీపీ వెంటే ఉన్నారని వ్యాఖ్యానించారు. ఎంత ఎండ ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రజలు ఓపిగ్గా క్యూలైన్లలో నిలబడి ఓటు హక్కును వినియోగించుకున్నారని కితాబిచ్చారు.